గత ఏడాది వరకు ఈటివి లో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుని ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో పాపులర్ అయిన సుధీర్-రష్మీ జంట ఇప్పుడు విడిపోయింది. సుధీర్ హీరోగా మారటం, జబర్దస్త్ వదిలేసి ఈటీవికి దూరమవడం, ఇతర ఛానల్స్ లో అవకాశాలు పుచ్చుకుని రష్మీ ని ఆన్ స్క్రీన్ లో వదిలేసాడు..
రష్మీ ఇప్పటికి ఈటీవీలో మాత్రం వస్తోన్న జబర్దస్త్, ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే ఫెస్టివ్ ప్రోగ్రామ్స్ ని వదలడం లేదు, అంతేకాదు రష్మీ ఇతర ఛానల్స్ కి వెళ్లడం లేదు, సుధీర్ ఈటీవికి దూరంగా ఉంటున్నా రష్మీ ఈటివి నే అంటిపెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు రష్మీ కి కొత్త పార్ట్నర్ దొరికాడు.
ఆయనే ఢీ లో యాంకర్ గా వస్తున్న నందు తో రష్మీ రొమాన్స్ మొదలు పెట్టింది. ఈ ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్ అనగనగ ఈ ఉగాది కి లో రష్మీ-నందు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది అంటున్నారు ఉగాది స్పెషల్ ప్రోగ్రాం ప్రోమో చూసిన వారు. అంతేకాకుండా సుధీర్ ని వదిలి నందు తో రష్మీ రొమాన్స్ చేస్తుంది అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్.