Advertisement
Google Ads BL

హీరో-హీరోయిన్స్ కి మధ్య తేడా అదే-పూజ


ఏ భాషలో అయినా హీరోలకున్న ప్రయారిటీ హీరోయిన్స్ కి ఉండదు అనేది అందరికి తెలిసిందే. హీరోల పేర్లు, వారికున్న పాపులారిటీ  కారణంగానే సినిమాలు హిట్ అవుతాయని దర్శకనిర్మాతలు నమ్మకం. అందుకే హీరోలకు భారీ పారితోషికాలు ఉంటాయి. హీరోయిన్స్ ని కమర్షియల్ సినిమాల్లో నాలుగు పాటలు, నాలుగు సీన్స్ కోసం తీసుకొస్తారు, వారి క్రేజ్ ఎంతోకొంత సినిమాకి ఉపయోగపడుతుంది. 

Advertisement
CJ Advs

కొంతమంది హీరోయిన్స్ ఉంటే సినిమాలు ఆడేస్తాయి. అందుకే వారిని పెట్టి లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కిస్తారు, క్యాష్ చేసుకుంటారు. తాజాగా హీరోలకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, హీరోయిన్స్ కి అంత ప్రయారిటీ ఉండదు అంటూ పూజ హెగ్డే చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

హీరోల క్యారవాన్స్ సినిమా షూటింగ్ జరిగే సెట్ పక్కనే ఉంచుతారు, మిగిలిన వాళ్ళవి దూరంగా ఉంటాయి. మేము బరువైన లెహంగాలు ధరించి సెట్ వరకు నడుచుకుంటూ రావాలి, కొన్నిసార్లు అంతబరువైన లెహంగాలతో ఇబ్బంది పడతాము, షాట్ అయ్యాక కూడా అంతే. మరి కొన్నిసార్లు పోస్టర్స్ లో మా పేరు కూడా ఉండదు. 

లవ్ స్టోరీస్ లో నటించినా గుర్తింపు ఉండదు, సినిమా అనేది  సమిష్టి కృషి, అందరూ నా అభిమాన హీరోలే, అందరిలో అనుష్క శర్మ అంటే ఇష్టం, ఎందుకంటే ఆమె వ్యక్తిత్వం నాకు దగ్గరగా ఉంటుంది. ఆమెకు ఇండస్ట్రీలో సపోర్ట్ లేనట్లే నాకు కూడా లేదు అంటూ పూజ హెగ్డే చెప్పుకొచ్చింది. 

The difference between hero and heroine is the same - Pooja Hegde:

We Walk Long Distances While Heroes Relax Pooja Hegde
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs