గేమ్ చేంజర్ రిజల్ట్ ని పక్కనపెట్టేసి రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC 16 షూటింగ్ లో పాల్గొంటున్నారు. గత నెల రోజులుగా విరామం లేకుండా హైదరాబాద్ లో జరుగుతున్న నైట్ షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొంటున్నారు. పెద్ది(వర్కింగ్ టైటిల్) గా తెరకెక్కుతున్న RC 16 చిత్రం సెట్స్ లో రీసెంట్ గానే జాన్వీ కపూర్ ఇంకా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ లు జాయిన్ అయ్యారు.
అయితే ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ లుక్ ని మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా వదలబోతున్నారని తెలుస్తుంది. రామ్ చరణ్ ఈ చిత్రంలో ఆట కూలీగా కనిపిస్తారని టాక్, కోచ్ గా శివ రాజ్ కుమార్ కనిపిస్తారట. మరి రామ్ చరణ్ పెద్ది లుక్ ఎలా ఉండబోతుందో అంటూ మెగా ఫ్యాన్స్ అప్పుడే క్యూరియాసిటీ చూపిస్తున్నారు.
తాజాగా RC 16 ని 2026 మార్చి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ అనుకొంటున్నారని సమాచారం. మార్చి 27 చరణ్ పుట్టిన రోజు. అందుకే ఈ డేట్ ఫిక్స్ చేసేందుకు మేకర్స్ ఆలోచన చేస్తున్నారట. వీలయితే రామ్ చరణ్ ఈ బర్త్ డే రోజునే ఈ డేట్ లాక్ చేసి పోస్టర్ తో వదిలే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.