ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం థియేటర్స్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఓటీటీ ఇంకా బుల్లితెర పైనా సంక్రాంతికి వస్తున్నాం రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఈ చిత్రం అంతగా సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అనిల్ రావిపూడి ఆ సినిమాకి చేసిన ప్రమోషన్స్.
సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ చూసి చాలామంది సినిమా థియేటర్స్ వెళ్లారంటే అతిశయోక్తి లేదు. అంతలా సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకేళ్లారు అనిల్ రావిపూడి. ఇప్పుడు అదే మాదిరి నితిన్-వెంకీ కుడుములు రాబిన్ హుడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. చాలా వెరైటీగా, కొత్తగా రాబిన్ హుడ్ ను ప్రేక్షకుల్లోకి తీసుకెళుతున్నారు.
తాజాగా నితిన్ ని ఏంటి సినిమాని అంతలా ప్రమోట్ చేస్తున్నారు అని అడగగానే.. ఈమధ్యన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ప్రమోషన్స్ చూసారు కదా, ఎంత వెరైటీగా ఉన్నాయో, అనిల్ రావిపూడిని రోజు తిట్టుకునేవాడిని, ఈ సినిమా కోసం తెగ తిరుగుతున్నాడు, అనిల్ ఏమిటి, వెంకీ సార్ కూడా సినిమాని తెగ ప్రమోట్ చేసారు. సినిమా సక్సెస్ లో ప్రమోషన్స్ ఎంత కీలక పాత్ర వహిస్తాయో తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ కాలంలోప్రమోషన్స్ లో కొత్తదనం చూపిస్తేనే జనాలు థియేటర్లు కు కదులుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడానికి ప్రమోషన్స్ ప్రధాన కారణం, మేము రాబిన్ హుడ్ కి అదే ఫాలో అవుతున్నామంటూ నితిన్ చెప్పుకొచ్చాడు.