మిల్కి బ్యూటీ తమన్నా ఇప్పుడు సౌత్ లో కన్నా ఎక్కువగా నార్త్ లోనే కనిపిస్తుంది. సౌత్ లో ఓదెల 2 తప్ప మరో ప్రాజెక్ట్ ఆమె చేతిలో లేదు. కానీ హిందీలో తమన్నా బిజీగా కనబడుతుంది. అక్కడ వెబ్ సీరీస్ లు, సీనియర్ హీరోలతో సినిమాలంటూ బిజీగా వున్న తమన్నా ఈమధ్యన బ్రేకప్ వార్తలతో ట్రెండ్ అయ్యింది.
నటుడు విజయ్ వర్మ తో తమన్నా కొన్నాళ్ళు సీక్రెట్ గా డేటింగ్ చేసింది. ఆతర్వాత మీడియా లో బాగానే కనిపించింది. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కానీ కొద్దిరోజులుగా తమన్నా-విజయ్ వర్మ కలిసి కనిపించడం లేదు. దానితో వీరు విడిపోయారనే వార్తలు స్టార్ట్ అయ్యాయి. కానీ తమన్నా ఈ వార్తలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
బ్రేకప్ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లడమో లేదంటే కుంగిపోవడమో చెయ్యకుండా మరింతగా యాక్టీవ్ అయ్యింది తమన్నా. అద్భుతాలు కోసం ఎదురు చూడకంది, ఆ అద్భుతాలు మీరే సృష్టించండి అంటూ చెబుతున్న తమన్నా తాజాగా ఇచ్చిన ఫోజులు చూస్తే మతి పోవాల్సిందే, తమన్నా ను అలా చూస్తే మిల్కి బ్యూటీ మెరుపులు అంటారేమో, అంత చక్కగా మెరిసిపోయింది తమన్నా.