పాన్ ఇండియా సినిమాలు, స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు సీజన్ ని చూస్ చేసుకుంటున్నాయి.. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ డేట్స్ లాక్ చేసుకుంటున్నాయి.. లేదా హాలిడేస్ చూసుకుంటున్నాయి
లాంగ్ వీకెండ్ కలిసొచ్చే డేట్సుకి ప్రయారిటీ ఇస్తున్నాయి.. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలు ఏ చిన్న గ్యాప్ దొరికినా థియేటర్ లో వాటి అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ప్రయత్నిస్తున్నాయి.. లాస్ట్ వీక్ వచ్చిన సినిమాలలో ఓ చిన్న సినిమా అతి పెద్ద విజయం సాధించింది నాని నిర్మించిన కోర్టు. ఆ సక్సెస్ చూసి చాలా మందిలో కాస్త ఉత్సాహం కలిగింది..
మన కంటెంట్ ప్రేక్షకులకి నచ్చిదేమో అనే నమ్మకం పెరిగింది.. లేక లేక దొరికిన ఓ MT date లో చిన్న సినిమాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 సినిమాలు పోటీపడుతున్నాయి..
అవేంటో చూద్దాం..
ఎప్పటినుంచో సక్సెస్ కోసం శతవిధాల ప్రయత్నిస్తున్న సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్, చిన్నారి పెళ్ళికూతురు అవికాగోర్ కలిసి నటించిన సినిమా షణ్ముఖ. ఈ వీక్ రిలీజ్ కి రెడీ అయ్యింది. ప్రేమకావాలి, లవ్లీ సినిమాలతో ఆది సక్సస్ కొట్టిన, ఉయ్యాల జంపాల వంటి సక్సెస్ ఫుల్ సినిమా తరువాత మళ్ళీ సక్సస్ రాలేదు ఇద్దరికీ. ఒక్క విజయం కూడా వీరివైపు చూడలేదు.. అప్పటినుంచి స్ట్రగ్గుల్ అవుతున్న ఈ జంట ఈ సినిమా ద్వారా సక్సస్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు.. ఇందులో ఆది పోలీస్ లుక్ లో కనిపిస్తున్నాడు.. దీనిలో కొందరు అమ్మాయిలు కిడ్నాప్ అవ్వడం.. ఆ అమ్మాయిలని ప్రేమించిన అబ్బాయిలు ఆత్మహత్య చేసుకోడం.. ఆ రహస్యాన్ని చేదించడమే షణ్ముఖ సినిమా కాన్సెప్ట్.. వినడానికి ఆసక్తిగా అనిపించే ఈ కాన్సెప్ట్ విజువల్ గా ఎలా ఉంటుందో ఈ విషయం కొన్ని గంటల్లో ప్రేక్షకులు చెప్పేస్తారు..
అలాగే అస్సిటెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి కమెడియన్ గా మారి మంచి గుర్తింపు తెచ్చుకుని హీరోగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సప్తగిరి నటిస్తున్న రీసెంట్ సినిమా పెళ్లి కానీ ప్రసాదు. మల్లీశ్వరి సినిమాతో ఈ పేరు చాలా పాపులర్ అయింది. ప్రభాస్ ట్రెయిలర్ రిలీజ్ చేయటంతో ఈ సినిమాపై కాస్త బస్ క్రియేట్ అయింది. కానీ ట్రైలర్ మాత్రం కొంచం soso గానే అనిపించింది అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో .. సప్తగిరి ఏమేరకు మెప్పించగలడో, ఎంత వరకు సక్సస్ అవ్వగలడో అది కూడా కొన్ని గంటల్లో తేలిపోతుంది..
రీసెంట్ గా కోర్టు సినిమాలో హీరో రోల్ ప్లే చేసిన హర్ష రోషన్ నెక్స్ట్ సినిమాగా టుక్ టుక్ రిలీజ్ కాబోతుంది.. ఈ సినిమా పూర్తిగా కుర్రాళ్ళ హడావిడి కోలాటం అనేది ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది.. జాతిరత్నాలు టైపులో ఓ ముగ్గురు కుర్రాళ్ళ హంగామాతో ప్రేక్షకులకి హాస్యం పంచాలని చేసిన ప్రయత్నం టుక్ టుక్.. మరి ఈ సినిమాకి ప్రేక్షకుల స్పందన ఏంటో కొద్దిగంటల్లో..
అనగనగా ఆస్ట్రేలియాలో అనే టైటిల్ తో పూర్తిగా తెలుగు తారాగణంతో ఆస్ట్రేలియా బాక్ డ్రాప్లో వస్తున్న సినిమా కూడా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది.. మరి ఆ ఆస్ట్రేలియా కథను మన ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఎలా ఆదరిస్తారో చూద్దాం..
ఆర్టిస్ట్ తానేంటో ప్రూవ్ చేసుకోవాలని ప్రతి ఆర్టిస్ట్ తపన పడుతుంటాడు.. ఓ మంచి ఆర్టిస్ట్ నీ మలచాలి అని ప్రతి దర్శకుడు ఆలోచిస్తాడు.. అలాంటిది ఆర్టిస్ట్ అనే టైటిల్ పెట్టి నీది నాది ఒకటే ప్రపంచం కానీ ఎప్పటికీ ఒకటి కాలేము అనే కాన్సెప్ట్ తో కొత్త దర్శకుడు రతన్ రిషి తెరకెక్కిస్తున్న సినిమా కూడా రేపే రాబోతుంది
ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే
పుష్ప 2 సినిమాలోని కిస్సిక్ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి చెప్పాల్సిన అవసరం లేదు, అదే పదాన్ని ఓ తెలుగు డబ్బింగ్ సినిమా అయిన పిన్ to కి టిప్పి అనే హిందీ సినిమా తెలుగులో రేపు రిలీజ్ అవుతుంది.. ఈ సినిమాలోని గమ్మత్తేమిటంటే హీరో ముద్దుపెట్టిన అమ్మాయిలకి వేరే వాళ్ళతో పెళ్లి కావడం. అతను నిజంగా ప్రేమించిన అమ్మాయికి ముద్దు పెట్టాలంటే అతను భయపడటం, తను ఎక్కడ దూరం అవుతాదో అని కంగారు పడటం.. మంచి ఎంటర్టైనర్ అంటున్నారు.. మరి మన తెలుగు ఆడియెన్స్ ఏవిధంగా రిసివ్ చేసుకుంటారో చూడాలి మరి
అలాగే ఈ మధ్య కాలంలో రిరీలీజ్ ల ట్రెండ్ బాగా కనిపిస్తుంది.. అదే కోవలో మరో రెండు సినిమాలు రీ-రిలీజ్ కు సిద్ధం అయ్యాయి.. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే మంచి గుర్తింపు తెచ్చుకున్న సినిమా సలార్.. ఈ సినిమా రేపు రీ-రిలీజ అవుతుంది..
నాని ,విజయ్ దేవరకొండ కలిసిన నటించిన ఎవడే సుబ్రమణ్యం కూడా కొన్ని థియేటర్ లలో రిలీజ్ అవుతుంది..
ఈ అన్ని సినిమాల్లో సప్తగిరి సినిమా ట్రైలర్ ప్రభాస్ రిలీజ్ చేయడం వల్ల కొంత + ప్లస్ అయిందనే చెప్పుకోవాలి. ఆది సాయికుమార్ అక్కడక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చినా అంత బస్ రాలేదు.. అండ్ టుక్ టుక్ కూడా కొంత ఎంటర్టెయింగానే కనిపిస్తుంది.. చూడాలి మరి ఈ వీక్ రిలీజ్ అయ్యే సినిమాల రిజల్ట్ ఏంటో అనేది.