సమంత కు విడాకులిచ్చేశాక హీరోయిన్ శోభిత తో నాగ చైతన్య కు పరిచయం ఎలా ఏర్పడింది, అంత త్వరగా చైతు శోభిత తో ఎలా మూవ్ అయ్యాడు అనేది నిన్నమొన్నటివరకు చాలామందిలో ఉన్న డౌట్. 2022లో కలిసి ఆతర్వాత ప్రేమించుకుని 2024 డిసెంబర్లో వివాహం చేసుకున్నట్లుగా చైతు-శోభితలు తమ ప్రేమ ఎలా మొదలైందో సందర్భాల్లో రివీల్ చేసారు.
తాజాగా వోగ్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ కోసం సరదాగా కాదు చాలా ప్రేమగా ఫోటో షూట్స్ చేయించుకుంది ఈ జంట. చైతూతో శోభిత డాన్స్ చేస్తూ హొయలు పోయింది. ఆ ఇంటర్వ్యూలో చైతు తో తనెలా ప్రేమలో పడింది, తమ పరిచయం ఎలా అయ్యింది అనే విషయాన్ని చెప్పుకొచ్చింది శోభిత.
నాగ చైతన్య మాట్లాడుతూ శోభితలో తనకు నచ్చేది విషయం ఆమె తెలుగు మాట్లాడడం అంటూ మరోసారి చెప్పాడు. మా ఇంట్లో అందరూ తెలుగే మాట్లాడతారు, నేను చెన్నై లో ఉండడంతో ఎక్కువగా తమిళ్, లేదంటే ఇంగ్లీష్ మాట్లాడతాను, శోభిత తెలుగు ముందు నా తెలుగు అస్సలు పనికిరాదు.
నాకు తెలుగు నేర్పించమని అడుగుతూ ఉంటాను, ఇక శోభిత ఫోటో షూట్స్ లో అసలు నవ్వదు. ఎందుకు అలా ఉంటావ్, కాస్త నవ్వచ్చుగా అని అడిగితే.. నేను లోపల నవ్వుతాను, మీకు కనిపించదు అంటూ నాకే డైలాగ్ కొడుతోంది అంటూ నాగ చైతన్య శోభిత గురించి ఆ ఇంటర్వ్యూలో సరదాగా మాట్లాడాడు.