Advertisement
Google Ads BL

రజిని స్ఫూర్తితోనే L2E లో ఆ సీన్


మలయాళ సినీ ఇండస్ట్రీలో మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికలో రూపొందిన లూసీఫర్ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ పృథ్వీరాజ్ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. మోహన్‌లాల్‌కి కూడా ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. కేవలం విమర్శకుల ప్రశంసలే కాదు కమర్షియల్‌గా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. నయనతార ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Advertisement
CJ Advs

ఇప్పుడే ఈ చిత్రానికి కొనసాగింపుగా L2 Empuraan పేరుతో సీక్వెల్ రూపొందింది. మార్చి 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ లూసీఫర్ చిత్రంలోని ఓ ఇంట్రెస్టింగ్ విషయం గురించి వెల్లడించారు.

లూసీఫర్ చిత్రంలో మోహన్‌లాల్ ప్రవేశించే సీన్ సినిమా మొత్తంలో హైలైట్‌గా నిలిచింది. ఈ సీన్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్‌ స్పూర్తిగా ఉన్నారని పృథ్వీరాజ్ వెల్లడించారు. ఒకప్పుడు రజనీకాంత్ నివసించే చెన్నై పోయస్ గార్డెన్ వీధి గురించి ఓ కథ విన్నానని దాన్ని బేస్ చేసుకుని లూసీఫర్ ఎంట్రీ సీన్ రాశానని ఆయన చెప్పారు. ఆ సీన్ ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన అందుకుందని ఇది తనకి ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు.

పృథ్వీరాజ్‌కు రజనీకాంత్‌పై ఉన్న అభిమానాన్ని పలు సందర్భాల్లో ప్రదర్శించాడు. L2 Empuraan ట్రైలర్‌ను కూడా ముందుగా రజనీకాంత్‌కి చూపించి ఆయన ఆశీస్సులు తీసుకున్నానని ఆ సమయంలో రజనీ చెప్పిన మాటలు జీవితాంతం మరిచిపోలేనని తెలిపారు. గతంలో రజనీని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదని అయితే భవిష్యత్తులో తప్పకుండా ఆ కలను నిజం చేసుకోవాలని ఉందని పృథ్వీరాజ్ ఉత్సాహంగా వెల్లడించారు.

This How Rajinikanth Inspired Prithviraj Sukumaran:

Prithviraj Sukumaran Reveals Rajinikanth Inspired Mohanlal Iconic Entry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs