బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో బుల్లితెర నటులు 11 మందిపై కేసు నమోదు కాగా.. వారిలో కొంతమంది పోలీస్ విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల క్రితం విష్ణు ప్రియా, టేస్టీ తేజ ల తరుపున శేఖర్ బాషా పోలిసుల వద్దకు వెళ్లి వారికి కొద్దిగా సమయం కావాలని అడిగారు. తాజాగా విష్ణు ప్రియా నేడు విచారణకు హాజరయ్యింది.
యాంకర్ విష్ణు ప్రియ తన లాయర్‌తో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. మీడియా కంట పడకుండా.. సైలెంట్ గా విష్ణు ప్రియ మాస కట్టుకుని విచారణ కోసం వెళ్ళిపోయింది. దాదాపు మూడు గంటలపాటు విచారించిన పోలీసుల విష్ణు ప్రియ సంచలన నిజాలు బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. విష్ణుప్రియ స్టేట్‌మెంట్ పోలీసులు రికార్డు చేశారు.
ఆమె దాదాపు 15కి పైగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్టుగా పోలీసులు ముందు ఒప్పుకుందట విష్ణు ప్రియ. ఒక్కో యాప్ కి ఆమె 90 వేలు పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆతర్వాత పోలీసులు ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు తెలుస్తోంది.