బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులు ఇప్పుడు టాప్ సెలబ్రిటీస్ కి మెడ కి చుట్టుకున్నాయి. నిన్నటివరకు టివి సెలెబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే అనుకుంటే ఇప్పుడు టాప్ సెలెబ్రిటీస్ కూడా బెట్టింగ్స్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వీడియోస్ వైరల్ అవడం వారిపై కేసులు నమోదు కావడం జరిగాయి.
వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్, ప్రణీత, మంచు లక్ష్మి, ఇప్పుడు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ లపై బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది.హైదరాబాద్ మియాపూర్ లో ఈ హీరోలపై కేసు నమోదు అయ్యింది. మరి ఈ హీరోలు ఇపుడు విచారణకు హాజరవుతారా, లేదా అనేది ఇంట్రెటింగ్ గా మారింది.
చిన్న వారిపై కేసులు పెట్టి విచారించే పోలీసులు, టాప్ సెలబ్రిటీస్ ని ఎలా హ్యాండిల్ చేస్తారా అనేది అందరిలో మొదలైన ఆత్రుత.