బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న చిన్న, పెద్ద సెలెబ్రెటీస్ పై ఇప్పుడు కేసులు నమోదు అవుతున్నాయి. యూట్యూబర్ అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వారి పేర్లని ఆధారాలతో సహా బయటపెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. హాట్ టాపిక్ కాదు వారిపై యాక్షన్ తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. హర్ష సాయి, సుప్రీత, రీతూ చౌదరి, పల్లవి ప్రశాంత్, భయ్యా సన్నీ యాదవ్, శ్యామల, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, విష్ణు ప్రియా వారిపై కేసులు నమోదు అవడమే కాదు వారు విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు కూడా ఇచ్చారు.
కేసు నమోదు అయిన మరుక్షణమే హర్ష సాయి ఓ వీడియో వదులుతూ బెట్టింగ్స్ యాప్స్ నిర్మూలనకు అందరూ పాటు పడదాం అంటూ నీతి కబుర్లు చెప్పాడు. కానీ విచారణకు హాజరవ్వకుండా తప్పించుకుపోయాడు. తాజాగా హైదరాబాద్ డీసీపీ మాట్లాడుతూ హర్ష సాయి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ తప్పించుకొని.. సాక్షులను బెదిరించడం లాంటివి చేస్తే వెంటనే వెతికి మరి తీసుకొచ్చి బొక్కలో వేస్తాం అంటూ ఆయన మీడియాకి చెప్పారు.
మరి హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ లు తప్పించుకుని తిరుగుతూ సాక్షులను నిజంగానే బెదిరిస్తున్నారా, లేదంటే డీసీపీ ఎందుకలా మట్లాడారు అంటూ నెటిజెన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హర్ష సాయి మాత్రం మామూలోడు కాదు, ముందు అతన్ని తీసుకొచ్చి జైలులో పెట్టండి అంటూ డీసీపీ ని ట్యాగ్ చేస్తూ చాలామంది ట్వీట్లు పెడుతున్నారు.