సోషల్ మీడియా ప్రభావం పెరిగినప్పటి నుంచి అనేక అబద్ధపు వార్తలు సులభంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించిన పుకార్లు వేగంగా ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా పుష్ప 2 దర్శకుడు సుకుమార్ బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కోసం ఓ ప్రత్యేకమైన కథ సిద్ధం చేశాడని.. షారుఖ్ ఆ కథను విని వెంటనే ఓకే చెప్పేశాడని ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు ఈ సినిమా కథ ఏ జానర్‌లో ఉంటుందో కూడా ఊహాగానాలు షురూ అయ్యాయి. ఈ వార్త హిందీ మీడియా వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయాల్సిన సినిమాపైకి వెళ్ళబోతున్నారు. పుష్ప 2 తర్వాత ఆయన రిలాక్స్ అవుతున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత పుష్ప 3 ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ మధ్య కాలంలో సుకుమార్ ముంబై వెళ్లలేదని.. షారుఖ్‌ను కలవలేదని ఆయన సన్నిహితులు స్పష్టం చేశారు. బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చినా.. టాలీవుడ్‌లోనే సినిమాలు చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడమే ఆయన లక్ష్యమని తెలిపారు. అందుకే సుకుమార్ షారుఖ్ ప్రాజెక్ట్ గురించి వస్తున్న వార్తలు పూర్తిగా పుకార్లేనని తేలిపోయింది.