అధికార పార్టీలో ఉంటే కేసులు ఉండవు, అలాగని మనసు చంపుకుని అధికార పార్టీలో చేరి కేసులు రూపు మాపుకోవాలా, లేదంటే అసలు రాజకీయాలకు రాజీనామా చేసి సైలెంట్ గా కృష్ణా రామా అనుకుంటే సరిపోతుందా, కేసులు మెడకు చుట్టుకోవని భావించి వైసీపీ పార్టీకి, రాజకీయాలకు రాజీనామా చేస్తే విచారణ పేరుతొ పదే పదే పిలవడం భావ్యమేనా,
సరే విచారణకు పిలిచారు, అధికార పక్షానికి నచ్చినట్టుగా నడుచుకుంటున్నా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి మాత్రం విచారణ తప్పడం లేదు. మొన్న కాకినాడ పోర్ట్ కేసులో సీఐడీ విచారణకు హాజరైనప్పుడు జగన్ పై ఫైర్ అయిన విజయసాయి రెడ్డి జగన్ కోటరీ పై కస్సుమన్నారు.
ఇప్పుడు మరోమారు విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చి ఈ నెల 25 న విచారణకు హాజరవ్వాలని చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి జగన్ తప్పు చెయ్యలేదు కానీ ఆయన చుట్టూ ఉన్నవారు తప్పు చేసారని విజయ్ సాయి రెడ్డి గత కేసులో చెప్పినట్లే ఈ కేసులో చెబుతారేమో చూడాలి.