బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేతినిండా సంపాదించిన విషయాన్నీ ఒక్కో పేరుని యూట్యూబర్ అన్వేషి బయటపెట్టడం చర్చనీయాంశం అవడమే కాదు, వారిపై చర్యలు తీసుకునేలా సజ్జనార్ కృషిచేస్తూ ఉండడంతో పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు అరెస్ట్ అవ్వగా ఇప్పుడు హర్ష సాయి, యాంకర్ శ్యామల, పల్లవి ప్రశాంత్, రీతూ లాంటి వాళ్లపై కేసులు నమోదు అయ్యాయి.
గతంలో తాను గనక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చెయ్యకపోతే వేరేవారు చేస్తారు, వారు డబ్బు సంపాదించుకుంటారు. అదే నేనైతే చాలామందికి సహాయపడతాను అంటూ హర్ష సాయి గొప్పగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై నోరు జారడంతో అతనిపైన కేసు నమోదు అయ్యింది. కేసు పెట్టడంతో దెబ్బకి దారికొచ్చిన హర్ష సాయి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసుపై రియాక్ట్ అయ్యాడు.
ఈ బెట్టింగ్ యాప్స్ వలన జరిగే నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్ కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. పోలసీస్ లో ఇష్యుస్ వలన, మరియు ఇతర కారణాల వలన బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్ గానే చెలామణి అవుతున్నాయి. ఏది ఏమైనా సరే ఈ సందర్భంగా మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే మా ఆడియన్స్ కు గాని, వ్యూవర్స్ కి గాని నష్టం కలిగించేది ఏమాత్రం చెయ్యబోము. ఈ బెట్టింగ్ కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో యాంకరేజ్ కానీ, ప్రమోట్ కానీ అస్సలు చెయ్యము, అలాగే మనందరం దీని లొసుగులు ఏమిటో కనుక్కుని దానిని నిర్మూలించేందుకు కృషి చెయ్యాలని కొరుకుంటూ మీ హర్ష సాయి అంటూ ఓ వీడియో వదిలాడు.