Advertisement
Google Ads BL

క్షమించమని వేడుకున్నా వదిలేదెలే


ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై పెట్టే కేసులతో ఒక్కొక్కరూ గజగజ వణికిపోతున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యిపోయి ఆ క్రేజ్ తో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ చేతినిండా సంపాదిస్తున్న వారి పేర్లను యూట్యూబర్ నా అన్వేషి బయటపెట్టడంతో విసి సజ్జనార్ ఒక్కొక్కరిపై కేసులు పెట్టించి అరెస్ట్ చేయిస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇప్పటికే భయ్యా సన్నీ యాదవ్ ని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు గాను అరెస్ట్ చెయ్యగా, హర్ష సాయి పై కేసు నమోదు అయ్యింది. దానితో ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వచ్చి తాము తప్పు చేసాము, ఇకపై ఇలాంటి యాప్స్ ప్రమోట్ చెయ్యము అంటూ క్షమించమని వేడుకుంటున్నారు. 

కానీ బెట్టింగ్స్ యాప్ ప్రమోటర్స్ ని మాములుగా వదిలేలా లేరు. తాజాగా  బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ 11 మందిలో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ తదితరులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసారు. 

సుప్రీత, సురేఖ వాని, రీతూ చౌదరి లాంటి క్షమించమని వేడుకుంటున్నా పోలీసులు మాత్రం వీరిని వదిలేలా కనిపించడం లేదు, యాప్స్ ప్రమోషన్స్ తో లక్షలు దండుకుని ఇపుడు క్షమించమంటే సరిపోతుందా అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

11 Telugu Influencers Booked For Promoting Betting Apps:

Betting Apps Promotion
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs