రాజా సాబ్ కూడా ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అవ్వడం పక్కా. మార్చి 28 నుంచి హరి హర వీరమల్లు విడుదల వాయిదా వేస్తూ మే 9 రిలీజ్ డేట్ ఇచ్చారు. కానీ మారుతి రాజా సాబ్ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు. సమ్మర్ రేస్ లో రాజా సాబ్ ఉండదు అంటూ చాలా రకాల న్యూస్ లు సోషల్ మీడియాలో కనబడుతున్నాయి.
మరి రాజా సాబ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది, ప్రభాస్ చెసే కామెడీకి ప్రేక్షకులు పడి పడి నవ్వడం ఖాయమంటూ అందులో నటించిన నటులు రాజా సాబ్ పై ఇస్తున్న అప్ డేట్స్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. కానీ మేకర్స్ నుంచి రిలీజ్ కబురు రాక ప్రభాస్ ఫ్యాన్స్ లో అసహనం మొదలైంది.
గతంలో ప్రభాస్ సినిమాల రిలీజ్ తేదీల విషయంలో ఫ్యాన్స్ కు ఎలాంటి పరిస్థితి ఎదురైందో, ఇప్పుడు రాజా సాబ్ విషయంలోనూ అదే జరగడం ఫ్యాన్స్ కు కష్టంగా మారింది. మరి మారుతి చొరవ చేసి రాజా సాబ్ కి ఆ డేట్ ఏదో అనౌన్స్ చేస్తే ఫ్యాన్స్ కూల్ అవుతారు. లేదంటే మారుతికి నిర్మాణ సంస్థకు మోత మోగిపోవడం ఖాయం.