Advertisement
Google Ads BL

విజయసాయిరెడ్డిని అనవసరంగా కెలికారు


విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీ పెట్టకముందు నుంచి జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. పార్టీ పెట్టాక జగన్ పక్కనే ఉన్నారు. జగన్ కి రైట్ హ్యాండ్ గా వైసీపీ పార్టీలో కీలకంగా గొంతు వినిపించిన విజయసాయి రెడ్డి సైలెంట్ గా పార్టీకి, అసలు రాజకీయాలకే రాజీనామా చేసారు. వైసీపీ పార్టీకి కానీ, రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకున్నారో కూడా చెప్పలేదు. 

Advertisement
CJ Advs

జగన్ మాత్రం విజయ్ సాయి రెడ్డిపై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసి రెచ్చగొట్టడంతో విజయసాయి రెడ్డి రీసెంట్ గా సిబిఐ విచారణకు వెళ్లి జగన్ పై, వైసీపీ పార్టీ కోటరీ పై చేసిన కామెంట్స్ తో జగన్ తో పాటుగా వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. దానితో ఒక్కొక్కరిగా మీడియా ముందుకొచ్చి విజయ్ సాయి రెడ్డిని కెలికి కెలికి వదిలారు. 

మరి విజయ్ సాయిరెడ్డి ఊరుకోరుగా ఆయన మరోమారు జగన్ కోటరీ పై ఇండైరెక్ట్ గా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. 

పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది.  దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు, తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి! ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు! ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే! అంటూ జగన్ పై విజయసాయి రెడ్డి రెచ్ఛిపోయి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల స్పందన ఎలా ఉండబోతుందో చూద్దాం. 

Vijayasai Reddy was unnecessarily harassed.:

Vijaya Sai Reddy Sensational Comments On YS Jagan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs