ఈమధ్యన మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. తెలుగులో డబ్ చేసి విడుదలైన వారానికే ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు. జనవరిలో అలానే జరిగింది. థియేటర్స్ లో విడుదలైన థొవినో థామస్ ఐడెంటిటీ తెలుగులో డబ్ అయిన వారానికే ఓటీటీలోకి వచ్చేసింది.
ఇక గత నెల ఫిబ్రవరి 20 న మలయాళంలో విడుదలైన ఆఫీసర్ ఆన్ డ్యూటీ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఈ చిత్రాన్ని తెలుగు ప్రొడ్యూసర్స్ డబ్ చేసి మార్చ్ 14 అంటే నిన్న శుక్రవారం హోలీ సందర్భంగా థియేటర్స్ లో విడుదల చేసారు. మళయాళీలకు బాగా నచ్చిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ తెలుగు ప్రేక్షకులను బాగానే ఇంప్రెస్స్ చేసింది.
తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు. నిన్న మార్చి 14 న థియేటర్స్ లో విడుదలైన ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఇప్పుడు ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. అది కూడా మరో వారం రోజుల్లోనే. మార్చ్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ఆఫీసర్ ఆన్ డ్యూటీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ లోకి రానుంది.