టాలీవుడ్‌లో పూరి జగన్నాథ్, చార్మి కాంబినేషన్ చాలా ప్రత్యేకమైనది. వీరి మధ్య అనుబంధం వ్యక్తి గతంగానే కాకుండా వృత్తిపరంగా కూడా బలంగా ఉండేది. పూరి సినిమాలకు చార్మి నిర్మాతగా వ్యవహరించడం సాధారణమైపోయింది. అయితే తాజాగా వస్తున్న వార్తలు మాత్రం వీరి భాగస్వామ్యానికి ముగింపు పలికినట్లు కనిపిస్తున్నాయి. మరి నిజంగా వీరిద్దరూ ఇక కలిసి పని చేయరా..?
ఇటీవల పూరి జగన్నాథ్ తన కొత్త సినిమా కోసం సన్నాహాలు మొదలు పెట్టాడు. గతంలో ఆయన ఏ ప్రాజెక్ట్ చేసినా చార్మి ప్రొడక్షన్ పార్ట్ లో భాగమై ఉండేది. కానీ ఈసారి మాత్రం ఆమె ముద్ర ఉండకపోవచ్చని సమాచారం. పూరి ఈసారి పూర్తిగా కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే మీద మాత్రమే దృష్టి పెట్టబోతున్నాడని.. నిర్మాణ బాధ్యతలు వేరే వ్యక్తుల చేతికి అప్పగించే ఆలోచనలో ఉన్నాడని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
లైగర్ సినిమా పరాజయం తర్వాత పూరి, చార్మి మధ్య ఉన్న వృత్తిపరమైన బంధం బలహీనపడిందని టాక్. ఆ సినిమా భారీ నష్టాలను మిగిల్చిన కారణంగా ఇద్దరూ ఒకే విధంగా ఆలోచించలేకపోయారని.. ఆర్థిక పరంగా కూడా కొంత ఇబ్బందులు వచ్చాయని సమాచారం. దీంతో పూరి తన భవిష్యత్తు ప్రాజెక్ట్‌లను కొత్త స్ట్రాటజీతో ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు.
డబుల్ ఇస్మార్ట్ సినిమా అనౌన్స్ చేసినప్పటికీ ఇంకా దాని నిర్మాణం ప్రారంభమయ్యే సూచనలు కనిపించటం లేదు. ఈ ప్రాజెక్ట్‌లో చార్మి భాగస్వామి అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు టాక్. లైగర్ సినిమా ఫలితంతో పెండింగ్ బాకీలు ఇంకా పూర్తిగా క్లియర్ కాకపోవడం.. అలాగే పూరి, చార్మి మధ్య ఆర్థిక లావాదేవీలు ఇంకా పూర్తిగా సర్దుబాటు కాకపోవడం వల్ల డబుల్ ఇస్మార్ట్ ప్రాజెక్ట్‌పై కూడా కొన్ని మార్పులు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.