జనసేన కోసం పని చేస్తూ తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాగబాబు కు ఫైనల్ గా ఎమ్యెల్సీ హోదా దక్కింది. పొత్తు లో భాగంగా చంద్రబాబు నాగబాబు కి ఎమ్యెల్సీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు కోసం చంద్రబాబు కి రికమండ్ చేశారు. నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ తమ్ముడు నాగబాబు కు శుభాకాంక్షలు తెలియజేసారు.
ఎమ్మెల్సీ గా ఎన్నికయి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి లో తొలి సారి అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబు @NagaBabuOffl కి నా అభినందనలు,ఆశీస్సులు!💐
ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని, వారి అభిమానాన్ని మరింతగా చూరగొనాలని ఆశిస్తూ నీకు నా శుభాకాంక్షలు!🤗 అంటూ సోషల్ మీడియా వేదికగా చిరు నాగబాబు కి విషెస్ తెలియజేసారు.