జనవరి 10 నుంచి మెగాస్టార్ చిరంజీవి నుంచి రావాల్సిన విశ్వంభర చిత్రం రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం కోసం త్యాగం చేస్తూ పోస్ట్ పోన్ చేసారు. ఆ తర్వాత ఫిబ్రవరి, ఏప్రిల్, మే 9 న విశ్వంభర రిలీజ్ తేదీ ప్రకటించొచ్చనే ఊహాగానాలు ఊహాగానాలు కిందే మిగిలిపోయాయి కానీ, ఇంతవరకు మేకర్స్ విశ్వంభర విషయాన్ని తేల్చలేదు.
ఈలోపు మార్చ్ 28 నుంచి పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు ని పోస్ట్ పోన్ చేస్తూ మే 9 కి కొత్త రిలీజ్ తేదీని ప్రకటించేసారు. మే 9 చిరు విశ్వంభర విషయంలో ఆలోచనలో ఉన్న సమయంలోనే పవన్ హరి హర వీరమల్లు తేదీ ని లాక్ చేసేసారు. మరి పవన్ కళ్యాణ్ మే 9 ని ఆక్యుపై చేసారు.
మరి చిరంజీవి విశ్వంభర మే 9 కి ఖచ్చితంగా రాదు. సమ్మర్ రేస్ నుంచి విశ్వంభర తప్పుకుందా, అందరూ అనుకుంటున్నట్టుగా మెగాస్టార్ బర్త్ డే వరకు అంటే ఆగష్టు వరకు విశ్వంభర వచ్చే ఛాన్స్ లేదా, ఇన్ని కంఫ్యూజన్స్ ను మేకర్స్ ఎప్పటికి క్లియర్ చేస్తారో చూడాలి.