దిల్ రాజు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు, ఆయన కాంపౌండ్ నుంచి సినిమాలొస్తున్నాయంటే ప్రేక్షకులకు కొన్ని అంచనాలుంటాయి. దిల్ రాజు జెడ్జిమెంట్ పై అంత నమ్మకం ఉంటుంది. కొద్దిరోజులుగా దిల్ రాజు జెడ్జిమెంట్ పై అనుమానాలు కలిగేలా ఆయన నుంచి వస్తున్న సినిమాలు ఉంటున్నాయి.
దిల్ రాజు కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా, పాన్ ఇండియా ఫిలిం గా 3 లాంగ్వేజెస్ లో తెరకెక్కిన గేమ్ చెంజర్ రిజల్ట్ దిల్ రాజు కు బిగ్ షాక్ తగిలేలా చేసింది. గేమ్ చెంజర్ పైరసీ, అలాగే గేమ్ చేంజర్ టాక్ అన్ని సినిమాను డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్లేలా చేసాయి. దానితో దిల్ రాజు డిజప్పాయింట్ అయ్యారు.
తాజాగా దిల్ రాజు అల్లు అర్జున్ కి ప్రపోజల్ పెట్టారు, దిల్ రాజు నిర్మాతగా అల్లు అర్జున్ సినిమా అనే వార్తలు చూసిన కొందరు ఏంటి దిల్ రాజు మరో పెద్ద సినిమా చేసే సాహసం చేస్తున్నారా అంటూ తీసిపడేస్తున్నారు. గేమ్ చేంజర్ తర్వాత మరో పెద్ద సినిమా చేసే ధైర్యం దిల్ రాజు చేస్తారా అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. ఓ ప్రొడ్యూసర్ గా ఆయన లెక్కలు ఆయనకుంటాయి.