అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఏజెంట్ తర్వాత కొత్త చిత్రం సెట్స్ సెట్స్ లోకి ఎప్పుడెప్పుడు అడుగుపెడతాడా అని అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చెయ్యని రోజు లేదు. రెండేళ్ల క్రితం ఏప్రిల్ లో విడుదలైన ఏజెంట్ చిత్రం థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసింది. అయితే థియేటర్స్ లో ప్లాప్ అయిన ఏజెంట్ చిత్రం ఓటీటీ పై రెండేళ్లుగా తీవ్ర సస్పెన్స్ నడిచింది.
అదిగో ఏజెంట్ ఓటీటీలోకి వస్తుంది, ఇదిగో ఏజెంట్ ఎడిటింగ్ వెర్షన్ ఓటీటీలోకి వస్తుంది అంటూ ప్రచారం జరగడం, అది లేట్ అవడం అలా అభిమానులు రెండేళ్లుగా డిజప్పాయింట్ చేస్తూ వచ్చారు ఏజెంట్ మేకర్స్. ఫైనల్ గా ఏజెంట్ డిజిటల్ హక్కులు కొన్న సోని లివ్ ఈరోజు అంటే మార్చ్ 14 నుంచి ఏజెంట్ ను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చారు.
గత రెండేళ్ళుగా అఖిల్ ని బయట చూసింది వేళ్లమీద లెక్కెట్టొచ్చు. రెండేళ్ల తర్వాత అఖిల్ షో ఇలా ఓటీటీలోకి వచ్చింది. థియేటర్స్ లో డిజాస్టర్ అయిన ఏజెంట్ అసలు ఎందుకు అంతగా ప్లాప్ అయ్యిందో అనే విషయాన్ని తెలుసుకునేందుకు చాలామంది ఏజెంట్ ని సోని లివ్ లో వీక్షించడం గమనార్హం. మరి సోని లివ్ లో స్ట్రీమింగ్ పరంగా అఖిల్ ఏజెంట్ ఏమైనా రికార్డ్ సృష్టిస్తుందేమో చూడాలి.