మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ చిత్రం ఏప్రిల్ లో విడుదల కావడం లేదు. ఇది ఫిక్స్, లేదంటే రాజాసాబ్ టీజర్ దగ్గరనుంచి ప్రమోషన్స్ హడావిడి ఈపాటికే మొదలైపోయేది. అసలు రాజాసాబ్ సమ్మర్ లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. దసరా కు రాజా సాబ్ పోస్ట్ పోన్ అవ్వొచ్చనే టాక్ నడుస్తుంది.
అయితే మొదటి నుంచి రాజాసాబ్ హర్రర్ కామెడీతో తెరకెక్కుతుంది అనే మాట వినబడుతూనే ఉంది. తాజాగా కమెడియన్ సప్తగిరి తను నటించిన పెళ్లి కాని ప్రసాద్ ప్రమోషన్స్ లో రాజాసాబ్ పై ఇచ్చిన అప్ డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది.
రాజాసాబ్ లో ప్రభాస్ చేసే కామిడీ కి మేమే కిందపడి దొర్లుకుంటూ నవ్వాం, రాజాసాబ్ నెక్స్ట్ లెవల్ మూవీ, నెక్స్ట్ లెవల్ కామెడీ, మిమ్మల్ని రాజాసాబ్ ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది అంటూ సప్తగిరి ఇచ్చిన అప్ డేట్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేసింది.