హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, ఆయన కుమారుడు గౌతమ్ కీలక పాత్రల్లో తెరకెక్కిన బ్రహ్మ ఆనందం మూవీ రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఆర్‌విఎస్ నిఖిల్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. ప్రభాస్, మెగాస్టార్ లాంటి వాళ్ళు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసినా కంటెంట్ ఈ చిత్రానికి మైనస్ అయ్యింది.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యింది. బ్రహ్మ ఆనందం చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకుంది. బ్రహ్మ ఆనందం చిత్రాన్ని హోలీ పండుగ కానుకగా మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వారు ప్రకటించారు.
అంటే రేపు శుక్రవారం నుంచే బ్రహ్మ ఆనందం చిత్రం ఆహా లో స్ట్రీమింగ్ కానుందన్నమాట.