మీనాక్షి చౌదరి:
గ్లామర్ బ్యూటీ మీనాక్షి చౌదరి చాలా రోజుల తర్వాత సింపుల్ గా దర్శనమిచ్చింది. ఎప్ప్పుడు గ్లామర్ షో కి ఇంపార్టెన్స్ ఇచ్చే మీనాక్షిచౌదరి భార్య, తల్లి పాత్రలకు కాస్త దూరంగా ఉంటాను అని మొహమాటం లేకుండా చెప్పేసింది. కెరీర్ లో భార్య, తల్లి పాత్రలు చేస్తే ఇకపై అలాంటి పాత్రలే వస్తాయని మీనాక్షి ఫీలింగ్.
ఇక సోషల్ మీడియాలో గ్లామర్ షోతో హడావిడి చేసే మీనాక్షి చాలా రోజులకి సింపుల్ లుక్ లో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న మీనాక్షి రీసెంట్ గానే సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో 300 కోట్ల హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది.
కేతిక శర్మ:
గ్లామర్ భామగా టాలీవుడ్ ఆడియన్స్ దగ్గరైన కేతిక శర్మ కు ఓ అన్నంతగా అవకాశాలు రాకపోయినా.. తాజాగా నితిన్ రాబిన్ హుడ్ మూవీలో స్పెషల్ సాంగ్ లో దుమ్మురేపుతుంది. ప్రస్తుతం కేతిక శర్మ రాబిన్ హుడ్ మూవీతో తెగ ట్రెండవుతుంది. ఇలాంటి సమయంలో కేతిక వదిలినగ్లామర్ షో పిక్ క్రేజీ గా వైరల్ అయ్యింది.