జబర్దస్త్ యాంకర్ గా విపరీతమైన పాపులారిటీ ని మూటగట్టుకుని ఇపుడు బుల్లితెరను సైడ్ చేసి నటిగా వెండితెర మీద వెలిగిపోతున్న అనసూయ భరద్వాజ్ తనేం చేసినా దానిని సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంటుంది. ఫ్యామిలీతో స్పెండ్ చేసినా, లేదంటే ఫోటొ షూట్స్ అయినా, కాదు విమర్శించాలన్నా దేనికైనా సోషల్ మీడియానే వాడుతుంది.
ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ ని షేర్ చేసే అనసూయ వర్కౌట్స్ చేస్తున్న వీడియో ని షేర్ చేసింది. ఏ జిమ్ లోనో అనసూయ వర్కౌట్స్ చెయ్యడం లేదు. ఎప్పుడు భర్త తో కలిసి జిమ్ లో కనిపించే అనసూయ తాజాగా తన ఇంటి టెర్రస్ పైనే యోగ, ఇంకా వర్కౌట్స్ చేస్తున్న వీడియో వదిలింది. అంతేకాదు ఇంటి ముందు జిమ్ డ్రెస్ లోనే ముగ్గు వేస్తూ, ఆతర్వాత డైలీ రోటీన్లో భాగంగా షూటింగ్ కి తయారవుతూ ఆ వీడియో లో కనిపించింది.
40 ప్లస్ ఏజ్ లో కాస్త బరువు పెరిగిన అనసూయ డైలీ వర్కౌట్స్ చేస్తుంది. ప్రస్తుతం బుల్లితెరపై అనసూయ కిర్రాక్ బాయ్స్-కిలాడీ గర్ల్స్ షో కి జెడ్జి గా హాజరవుతుంది. ఆ షో త్వరలోనే స్టార్ మా లో మొదలు కాబోతుంది.