వైసీపీ ప్రభుతంలో జగన్ తర్వాత స్థానంలో కనిపించిన విజయసాయి రెడ్డి ప్రతిపక్షాలపై లా పాయింట్స్ తో విరుచుకుపడిపోయేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా స్ట్రాంగ్ గానే కనిపించిన విజయసాయి రెడ్డి రీసెంట్ గా వైసీపీ పార్టీకి, రాజ్యసభ సబ్యత్వానికి, రాజకీయాలకు గుడ్ బై చెప్పి అందరికి షాకిచ్చారు.
తాజాగా ఆయన కాకినాడ పోర్ట్ కేసులో సిఐడి ఇచ్చిన నోటీసులతో విచారణకు హాజరై ఆతర్వాత మీడియాతో మాట్లాడారు. వైసీపీ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు, జగన్ చుట్టూ ఉన్న కోటరీ పై ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. వైసీపీ పార్టీలో కోటరీ కారణంగానే తాను జగన్ కు దూరమైనట్టుగా విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
గత మూడేళ్ళుగా తనని తొక్కుతూనే పార్టీలో కొంతమంది పైకి ఎదిగారు, దాని వల్ల తనకి నష్టం ఏమి జరగలేదు, కోటరీ కి దగ్గరగా ఉంటేనే జగన్ ను కలవనిస్తారు, పార్టీ అధినేత చెప్పుడు మాటలు వింటే పార్టీకి నష్టం జరుగుతుంది. వైసీపీ పార్టీలో తనకు జరిగిన అవమానం ఎవరికీ జరగలేదు, తాను పడిన అవమానాలు ఎవరూ ఎదుర్కోలేదు, అంతగా అవమానపడ్డాను. తనలో ఎలాంటి మార్పు రాలేదు కానీ, జగన్ పూర్తిగా మారిపోయారంటూ విజయసాయి రెడ్డి మీడియా ముందు ఓపెన్ అయ్యారు.