రకుల్ ప్రీత్ పెళ్లి చేసుకుని ఏడాది పూర్తయ్యింది. బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ ని గత ఏడాది గోవా లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న రకుల్ ప్రీత్ తర్వాత సినిమా షూటింగ్స్, జిమ్ లో గాయపడడంతో ఎనిమిదివారాల బెడ్ రెస్ట్, అత్తమామలతో కలిసి ఫెస్టివల్స్ సెలెబ్రేట్ చేసుకోవడం అన్నీ చేసింది.
ఇక రకుల్-జాకీ భగ్నానీ ల వివాహం అయ్యి ఏడాది పూర్తి కావడంతో రకుల్ రెండు రోజుల క్రితమే భర్త జాకీ భగ్నానీ, అలాగే పేరెంట్స్, అత్తమామలతో సహా మాల్దీవులకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తుంది. పెళ్లి రోజు వేడుకలను భర్త తో ఇంకా ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల ఒడ్డున సెలబ్రేట్ చేసుకున్న రకుల్ ప్రీత్ ఆ ఫొటోస్ ను వీడియోస్ ను షేర్ చేస్తుంది.
రకుల్ ప్రీత్ ఫస్ట్ యానివర్సరీ ఫొటోస్, వీడియోస్ చూసిన వారు రకుల్ ప్రీత్ పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తుందిగా అంటూ కామెంట్ చేస్తున్నారు.