వైసీపీ ప్రభుత్వం హయాంలో బోరుగడ్డ అనిల్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను నరికేస్తాను, పొడిచేస్తాను అంటూ ఇష్టం వచ్చినట్టుగా వాగిన ఫలితం ఆయన్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి జైలులో ఉంచగా.. అనిల్ కుమార్ మాత్రం పోలిసుల నుంచి తప్పించుకునే ప్లాన్స్ చాలానే చేసాడు.
కొద్దిరోజుల క్రితం బోరుగడ్డ అనిల్ తల్లి అనారోగ్యం దృశ్య మధ్యంతర బెయిల్ పై బయటికొచ్చాడు. ఈలోపు బోరుగడ్డ ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లతో మధ్యంతర బెయిల్ తీసుకున్నట్లుగా పోలీసులు కనిపెట్టారు. కానీ బోరుగడ్డ అనిల్ తనకు పవన్ కళ్యాణ్, లోకేష్ ల నుంచి ప్రాణహాని ఉంది అంటూ వీడియో వదిలాడు. అంతేకాదు మధ్యంతర బెయిల్ ని పొడిగించాలంటూ మరో పిటిషన్ వేసాడు.
ఈలోపు బోరుగడ్డకు ఏపీ హై కోర్టు ఇచ్చిన బెయిల్ గడువు ముగియడం, మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో రాజమండ్రి జైలుకు వచ్చి లొంగిపోవాలనే కోర్టు ఆర్డర్ పై బోరుగడ్డ ఈరోజు రాజమండ్రి జైలులో లొంగిపోయాడు. ఆ వెంటనే బోరుగడ్డకు గుంటూరు పోలీసులు షాకిచ్చారు.
పాస్టర్‌ను బెదిరించిన కేసులో బోరుగడ్డ అనిల్ ను పీటీ వారెంట్‌పై పట్టాభిపురం పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు. ఎలాగైనా తల్లి అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ ని కోర్టు పొడిగిస్తే బయట ఉండొచ్చని ప్లాన్ చెయ్యగా, ఏపీ హై కోర్టు బోరుగడ్డకు ఇచ్చిన షాక్ తో కథ అడ్డం తిరిగి జైలులో కూర్చున్నాడు.