రెండు వారాల క్రితం ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్న నటుడు పోసాని కృష్ణమురళికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఏపీలో పోసానిపై ఏకంగా 17 కేసులు నమోదు అయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై వారి అభిమానులు కేసులు పెట్టారు. చాలా ప్రాంతాల్లో అంటే నరసారావు పేట, గుంటూరు, విజయవాడ, కర్నూలు ఇలా చాలా చోట్ల పోసానిపై కేసులు నమోదు అయ్యాయి.
ఏపీ పోలీసులు నాలుగైదు కేసుల్లో పోసానిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా, కోర్టు పలు కేసుల్లో పలు చోట్ల 14 రోజుల రిమాండ్ విధించగా, పోసాని లాయర్ ఆయనకు కోర్టులో బెయిల్ వచ్చేలా చేసారు. దాదాపుగా అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ఈరోజు పోసాని కృష్ణమురళి విడుదల కావాల్సి ఉంది.
కానీ చివరి నిమిషంలో పోసానికి మరో షాక్ తగిలింది. చివరి నిమిషంలో గుంటూరు సీఐడీ పోలీసులుఎంటర్ అయ్యి పీటీ వారెంట్ వెయ్యడం తో పోసాని కృష్ణ మురళి విడుదల ఆగిపోయింది.