అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ త్వరలోనే మొదలు కాబోతుంది, త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ ని వెనకకి నెట్టి అల్లు అర్జున్ ముందుగా అట్లీ ప్రాజెక్ట్ లోకి వెళ్లబోతున్నారనే వార్త బాగా వైరల్ అయ్యింది. అల్లు అర్జున్ కూడా అట్లీ స్టోరీకి కనెక్ట్ అయ్యి, ముందు అదే మొదలు పెడుతున్నారట. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్ డే కి అల్లు అర్జున్-అట్లీ కాంబో పై అఫీషియల్ అనౌన్సమెంట్ వస్తుందట.
ఇప్పటికే అల్లు అర్జున్ సీక్రెట్ గా అట్లీ ప్రాజెక్ట్ కోసం స్పెషల్ ట్రైనింగ్ కి వెళ్లారు అంటున్నారు. తాజాగా అల్లు అర్జున్-అట్లీ కాంబో ఇప్పటివరకు ఉన్న ప్లాన్ ప్రకారమైతే జూన్ లో మొదలుపెట్టి... 2026 ఆగస్ట్ లో రిలీజ్ చెయ్యాలనే ఆలోచన లో ఉన్నారట. అందుకు అనుగుణంగానే స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని టాక్.
ఇది చాలా పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని, చాలా పెద్ద స్పాన్, డిఫరెంట్ వరల్డ్ ని అట్లీ చూపిస్తారని అంటున్నారు. మరి అనౌన్సమెంట్ తోనే ఈ ప్రాజెక్ట్ కి హైప్ వచ్చేలా ఎర్పాట్లు జరుగుతున్నట్లుగా టాక్.