కింగ్ నాగార్జున ఈమధ్యన సినిమాలకు బ్రేకిచ్ఛారు. కాదు కాదు సోలో హీరోగా సినిమాలకు బ్రేకిచ్చి స్టార్ హీరోల సినిమాలో స్పెషల్ కేరెక్టర్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కీ రోల్స్ పోషిస్తున్న కూలి, కుబేర చిత్రాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అయితే నాగార్జున గత ఆరేళ్లుగా బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
కొన్ని సీజన్స్ నుంచి బిగ్ బాస్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతుంది. దానితో బిగ్ బాస్ కి అనుకున్నంతగా రేటింగ్ రావడం లేదు. నాగార్జున ఎపిసోడ్స్అంటే శని,ఆదివారాల కి అంతో ఇంతో రేటింగ్ వస్తున్నాయి. అయితే గత రెండు మూడు సీజన్స్ లో నాగార్జున హోస్ట్ గా తప్పుకుంటున్నారనే ప్రచారానికి నాగ్ చెక్కపెడుతూ వచ్చారు.
కానీ సీజన్ 9 కి నాగార్జున హోస్ట్ సీట్ నుంచి తప్పుకుంటున్నారనే వార్త గట్టి గానే వినబడుతుంది. నాగార్జున ఈసారి బిగ్ బాస్ కి రానని చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి అదే నిజమైతే నాగ్ ప్లేస్ లో ఈ సీజన్ కి హోస్ట్ గా ఎవరిని చూస్తామో అనే క్యూరియాసిటీ బుల్లితెర ఆడియన్స్ లో మొదలైంది.