సాయి పల్లవి నేచురల్ యాక్టింగ్ తోనే కాదు డాన్స్ కాదు తోనూ దుమ్ము రేపుతోంది. సాయి పల్లవి తో డాన్స్ చెయ్యాలంటే హీరోలకు చెమటలు పట్టాల్సిందే. కమర్షియల్ చిత్రాల వైపు అడుగు వెయ్యకుండా తనకు నచ్చిన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న సాయి పల్లవి గత ఏడాది తన చెల్లి పెళ్ళిలో ఎంతగా ఎంజాయ్ చేసిందో చూసారు.
చెల్లెలు మెహిందీ, సంగీత్ వేడుకలో డాన్స్ లు చేస్తూ నెమలి నాట్యమాడుతుందా అనిపించిన సాయి పల్లవి తాజాగా అమరన్, తండేల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మరింత క్రేజ్ సంపాదించింది. తాజాగా ఆమె ఓ పెళ్లి వేడుకలో డాన్స్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
చక్కగా సాంప్రదాయబద్దంగా చీర కట్టులో నేచురల్ గా కనిపించిన సాయి పల్లవి తన సోదరుడు పెళ్ళిలో డాన్స్ తో అలరించింది. సాయి పల్లవి కజిన్ పెళ్లి వేడుకలో చేసిన డాన్స్ చూసి యూత్ అయితే ఫిదా అవుతుంది. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది.