అఖిల్ ఏజెంట్ వచ్చి రేపు ఏప్రిల్ కి రెండేళ్లు పూర్తవుతుంది. ఏజెంట్ రిజల్ట్ తో డిజప్పాయింట్ అయిన అఖిల్ ఇప్పటివరకు తన తదుపరి ప్రాజెక్ట్ మొదలు పెట్టనే లేదు. వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు కిషోర్ నందు తో అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది అన్నారు, సంక్రాంతి తర్వాత పూజ కార్యక్రమాలతో అఖిల్-నందు ప్రాజెక్ట్ మొదలైపోయింది అన్నారు.
కానీ ఇప్పటివరకు అఖిల్ నెక్స్ట్ మూవీ మొదలు కాలేదట. మార్చి 14 నుంచి అంటే మరో రెండు రోజుల్లో అఖిల్-నందు ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతున్నట్లుగా తెలుస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈచిత్రం తెరకెక్కబోతుంది, నాగార్జున అఖిల్ కోసం ఈచిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
అయితే సంక్రాంతి తర్వాతే సైలెంట్ గా అఖిల్ షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా వార్తలొచ్చిన ఫైనల్ గా అఖిల్ సెట్స్ లోకి వెళ్ళబోయేది మాత్రం మార్చ్ 14 నుంచేనట. ఈ చిత్రంలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్ గా ఫైనల్ అయినట్లుగా టాక్.