రాజకీయాలు వదిలేసి హరే రామ హరే కృష్ణ అనుకుంటున్నా విజయసాయిరెడ్డి ని పాత కేసులు వదిలేలా లేవు. వైసీపీ ప్రభుత్వంలో అహంకారంతో మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో మెడకు చుట్టుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఎక్కడ టార్గెట్ చేస్తుందో అని రాజకీయాలకు స్వస్తి చెప్పి కామ్ అయిన విజయ్ సాయి రెడ్డి పై కేసులు నమోదు కావడం చూసి అయ్యో పాపం రాజకీయాలు వదిలేసినా కేసులు వదిలిపెట్టేలా లేవు అంటున్నారు ఏపీ ప్రజలు.
కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసులో కేవీ రావు ఫిర్యాదుతో విజయసాయి రెడ్డిపై 506, 384, 420, 109, 467, 120(బి) రెడ్ విత్ 34 సెక్షన్ల కింద సీఐడీ పోలీసులు విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల కిందట విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయన అందుబాటులో లేకపోవటంతో ఆయన భార్యకు నోటీసులు అందజేశారు.
ఈ కేసులో వై.వి.సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి ఏ1గా, విజయసాయిరెడ్డి ఏ2గా ఉన్నారు. మార్చి 12వ తేదీ ఉదయం11 గంటలకు విజయవాడ ఆఫీస్‌కు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు, విజయిసాయిరెడ్డి విచారణకు వెళ్తారా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.