Advertisement
Google Ads BL

సౌందర్య మృతి.. మోహన్‌బాబుపై కేసు


హీరోయిన్ సౌందర్య, ఆమె తమ్ముడు అమర్నాధ్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోలేదా? వారిద్దరిది హత్యా? ఆ హత్య వెనుక టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నాడా? ప్రస్తుతం పోలీసులకు అందిన ఫిర్యాదు చూస్తుంటే, కచ్చితంగా సౌందర్య డెత్ వెనుక ఏదో మిస్టరీ అయితే ఉందని అనిపిస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. 

Advertisement
CJ Advs

సౌందర్య, ఆమె తమ్ముడు అమర్నాధ్‌లను హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించింది యాక్టర్ మోహన్ బాబు అనేలా ఈ చిట్టిమల్లు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఘటనపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ హత్యకి కారణం ప్రస్తుతం జల్‌పల్లిలో మోహన్ బాబు ఉంటున్న నివాస స్థలమే కారణమని ఆయన చెప్పుకొచ్చాడు. 

జల్‌పల్లిలో సినిమా యాక్టర్ సౌందర్య‌కు ఉన్న 6 ఎకరాల గెస్ట్ హౌస్‌ని విక్రయించాలని మోహన్ బాబు అడిగారని, అందుకు సౌందర్య, ఆమె తమ్ముడు నిరాకరించడంతో కక్ష్య పెంచుకున్న మోహన్ బాబు.. సాక్ష్యాలు దొరకకుండా వారిద్దరినీ హత్య చేయించాడని చిట్టిమల్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

వెంటనే విచారణ జరిపి, జల్‌పల్లి మంచు టౌన్‌లో ఉన్న గెస్ట్ హౌస్‌ని గవర్నమెంట్‌కు స్వాధీనం చేయాలని, అనాధశ్రమానికి కానీ, మిలటరీ సోదరులకు కానీ, పోలీసులకు లేదంటే మీడియా వారికి ఆ 6 ఎకరాల గెస్ట్ హౌజ్‌ని ఇవ్వాలని కోరుతున్నట్లుగా ఈ ఫిర్యాదులో చెప్పుకొచ్చాడు. అంతేకాదు, మంచు మనోజ్‌కి కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. 

ఇంకా మంచు మోహన్ బాబు ద్వారా తనకు ప్రాణహాని ఉందని, ప్రాణ రక్షణ కల్పించాలని కూడా ఇందులో విన్నవించుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

Mystery Surrounds Soundarya Death, Case Filed Against Mohan Babu:

Mohan Babu hand in Soundarya death
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs