Advertisement
Google Ads BL

ఎన్టీఆర్- నెల్సన్ కాంబో కి పవర్ ఫుల్ టైటిల్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం క్రేజీ పాన్ ఇండియా ఫిలిమ్స్ తో ఊపిరి సలపనంత బిజీగా వున్నారు. వార్ 2 షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ లోకి అడుగుపెడతారా అని వెయిట్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. ఎన్టీఆర్ కూడా గ్యాప్ లేకుండా వార్ 2 ని కంప్లీట్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

ప్రశాంత్ నీల్ మూవీ రెగ్యులర్ షూట్ గత వారమే అఫీషియల్ గా మొదలయ్యింది. ఎన్టీఆర్ రాక కోసం ప్రశాంత్ నీల్ కూడా వెయిటింగ్. ఈ మూవీ ఓ కొలిక్కి రాగానే ఎన్టీఆర్ దేవర 2 ఫినిష్ చేస్తారు. కొరటాల శివ ఎన్టీఆర్ కోసం దేవర 2 స్క్రిప్ట్ లో కూర్చున్నారు. ఆయనకు ఎన్టీఆర్ దేవర 2 కంప్లీట్ అయ్యేవరకు మరో మూవీ చేసే ఉద్దేశ్యం కూడా లేదు. 

ఆపై ఎన్టీఆర్ ప్లాన్స్ పై ఫ్యాన్స్ లో అంత కంఫ్యూజన్ లేదు కారణం.. ఎన్టీఆర్-కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోని నాగవంశీ సెట్ చేస్తున్నారు. గత ఏడాది నుంచె ఈ ప్రాజెక్ట్ పై వార్తలొస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ తో నెల్సన్ మూవీ ఫిక్స్ అని తెలుస్తుంది. 

ఇప్పుడు ఎన్టీఆర్-నెల్సన్ కాంబో టైటిల్ పై ఓ క్రేజీ పవర్ ఫుల్ టైటిల్ వినవస్తుంది. ఈ సినిమాకి రాక్ (Rock) అనే టైటిల్ ను లాక్ చేసినట్లు వినికిడి. ఈ మూవీ 2026 లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది అని తెలుస్తోంది. .

Is this NTR-Nelson Dilip Kumar title:

Young Tiger to ROCK
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs