పుష్ప ద రూల్ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. పుష్ప ద రూల్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అల్లు అర్జున్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పాన్ ఇండియాలో భారీగా తెరకెక్కుతున్నట్లుగా బన్నీ వాస్ చెప్పుకుంటూ వచ్చారు. తీరా చూస్తే త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు.
అందుకే అల్లు అర్జున్ కోలీవుడ్ దర్శకుడు అట్లీ చెప్పిన కథ తో ముందుగా సినిమా మొదలు పెడుతున్నారనే టాక్ మొదలయ్యింది. అట్లీ కూడా అటు సల్మాన్ ఖాన్ తో చెయ్యాల్సిన సినిమాని పక్కనపెట్టి మరీ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడని అన్నారు. ఏప్రిల్ 8 న అల్లు అర్జున్-అట్లీ కాంబో పై అప్ డేట్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఈలోపు త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో గ్యాప్ రావడంతో ఆయన మరో హీరో వెంకటేష్ తో సినిమా చెయ్యాలని డిసైడ్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. వెంకటేష్ తో త్రివిక్రమ్ కి గతంలో ఉన్న కమిట్మెంట్ ఇప్పడు పూర్తి చేయబోతున్నారట. అల్లు అర్జున్ తో మూవీ మొదలయ్యే గ్యాప్ లో వెంకీ తో త్రివిక్రమ్ సినిమా చెయ్యబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి.