Advertisement
Google Ads BL

పూరి నాగార్జున సూపర్ కాంబినేషన్‌


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుస పరాజయాల తర్వాత తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఒక బలమైన కథతో ముందుకు రావాలని అనుకుంటున్నట్లు సమాచారం. తాజా వార్తల ప్రకారం కింగ్ నాగార్జునకు ఓ స్టోరీ చెప్పేందుకు రెడీ అవుతున్నాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్, శివమణి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మళ్లీ అదే కాంబో రిపీట్ కాబోతుందా అనే ఉత్కంఠ నెలకొంది.

Advertisement
CJ Advs

ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా రామ్ పోతినేని కెరీర్‌లో భారీ అంచనాలతో రూపొందినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పూరి గత సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో కథపరంగా బలమైన పాయింట్ లేకపోవడం ప్రధాన లోపంగా చెప్పుకుంటున్నారు. దీంతో తన తదుపరి చిత్రాన్ని విజయవంతం చేయడానికి పూరి కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం.

ఇప్పుడు నాగార్జున కోసం పూరి ఎలా వేరియేషన్ చూపిస్తాడు ఏ విధమైన కథను సిద్ధం చేశాడు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు మంచి విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈసారి మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ కాంబోని ప్లాన్ చేస్తున్నారా..? అన్నది వేచి చూడాలి. ప్రస్తుతం నాగార్జున పూరి జగన్నాథ్ సినిమా ఖరారు అయినట్లు అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ సినీ వర్గాల్లో మాత్రం ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.

Puri Nagarjuna Combination Soon:

Puri Nagarjuna super combination
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs