బాహుబలి సీరీస్, ఆపై ఆర్.ఆర్.ఆర్ చిత్రాలతో అంతర్జాతీయంగా విశేష గుర్తింపు పొందిన దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు తో ఏంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన మూవీ SSMB 29(వర్కింగ్ టైటిల్).
తాను రెండేళ్లు శ్రమపడి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని, మహేష్ బాబు ని వన్ ఇయర్ ఖాళీగా ఉంచి, మేకోవర్ చేయించి షూట్ స్టార్ట్ చేసారు రాజమౌళి. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. స్వయానా రాజమౌళి మహేష్ బాబు తో సహా ఎవ్వరూ సెట్ లోకి మొబైల్స్ తీసుకునురాని విధంగా ఆంక్షలు విధించబడ్డాయి. అందుకు తగ్గట్టే ఎటువంటి లీకేజి లేకుండా ఆ షెడ్యూల్ వర్క్ జరిగింది.
ఎప్పుడైతే ఒడిశాలో షూట్ ప్లాన్ చేసుకుని అవుట్ డోర్ లొకేషన్ లో చిత్రీకరణ మొదలు పెట్టారో అక్కడ తేడా వచ్చేసింది. ఎవరు తీశారో తెలియదు, ఎవర్ని నిందించాలి అర్ధం కాదు బట్ వీడియో క్లిప్ మాత్రం సోషల్ మీడియాలో వీర విహారం చేస్తుంది. అటువంటి లీకేజ్ కి పాల్పడిన వారిపై చాలా కఠిన చర్యలు తీసుకుని తీరతారు.
ఎథిక్స్ రీత్యా ఆ లీకైన క్లిప్ గురించి మా వైపుగా ఎటువంటి వివరణ ఇవ్వబోవడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం అది సినిమాలో చాలా ప్రత్యేకమైన సన్నివేశం. అటువంటి సీన్ లీక్ కావడం అటు మహేష్ బాబు ని, ఇటు రాజమౌళిని ఖచ్చితంగా బాగా బాధపెట్టే సందర్భం. ఎన్నో లెక్కలు వేసుకుని ఎంతో జాగ్రత్తగా తన సినిమాని ఓ శిల్పంలా చెక్కుకునే జక్కన్న ఇకపై మరింత జాగ్రత్త పడాలి. ఆయన కష్టాన్ని మహేష్ ఆన్ స్క్రీన్ మ్యాజిక్ ని మనం స్క్రీన్ పైనే చూడాలి. ఇలా లీకుల రూపంలో కాదు.
ఇకపై ఇలాంటివి జరగవని ఆశిద్దాం, జరక్కూడదని కోరుకుందాం. జరిగితే ఖండిద్దాం . సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే మహేష్ బాబు ఫాన్స్ మాత్రమే కాదు, టోటల్ తెలుగు సినిమా ఫాన్స్ ఇలాంటి లీక్స్ ని ఎంకరేజ్ చేయకూడదు. అస్సలు షేర్ చేయకూడదు.