రీసెంట్ గా విజయ్ వర్మ తో బ్రేకప్ చెప్పిన తమన్నా ప్రేమ కి దూరమవడం చాలా కష్టంగా ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గత రెండేళ్లుగా నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్న తమన్నా ఏమైందో ఏమో కొద్దిరోజులుగా విజయ్ వర్మతో కలిసి కనిపించడం లేదు. దానితో తమన్నా-విజయ్ వర్మ మధ్యలో బ్రేకప్ అయ్యింది అనే ప్రచారం ఊపందుకుంది.
తమన్నా కానీ, విజయ్ వర్మ కానీ ఈ విషయం డైరెక్ట్ గా చెప్పలేదు, ఇండైరెక్ట్ గా తమన్నా మాత్రం బ్రేకప్ పై పోస్ట్ లు పెడుతుంది. ఇక సౌత్ లో కేవలం ఓదెల 2 లో నటిస్తున్న తమన్నా ఎక్కువగా ముంబై లోనే కనిపిస్తుంది. నార్త్ కి వెళ్ళాక తమన్నా గ్లామర్ హీట్ పెంచేసింది.
టూ మచ్ గ్లామర్ తో తమన్నా అద్దరగొట్టేస్తుంది. తాజాగా బాలీవుడ్ లో ఓ ఈవెంట్ కి వెళ్లిన తమన్నా తన లేటెస్ట్ లుక్ ని పోస్ట్ చేసింది. అలా తమన్నాను చూడగానే అమ్మో తమ్ము బేబీ మామూలుది కాదు, ముంబై వెళ్ళాక అందాల ఆరబోత ఎక్కువైంది అంటూ కామెంట్ చేస్తున్నారు.