యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో సముద్రం బ్యాక్ డ్రాప్‌లో దేవర చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం సో సో టాక్‌తోనే రూ. 500 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు కొరటాల శివ ఇంకా గ్రిప్పింగ్ స్క్రిప్ట్‌తో దేవర 2ని రెడీ చేస్తున్నారు. ఈ పార్ట్ కూడా సముద్రపు బ్యాక్ డ్రాప్‌లోనే ఖచ్చితంగా తెరకెక్కుతుంది. ఇక ఎన్టీఆర్ హిందీలోకి ఎంట్రీ ఇస్తున్న వార్ 2 కూడా సముద్రం నేపథ్యంలోనే ఉంటుంది. వార్ 2లోని కీలక సన్నివేశాలు సముద్రంలోనే దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారట. అంతేకాదు ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 1960 బ్యాక్ డ్రాప్ గోల్డెన్ ట్రయాంగిల్‌గా పిలవబడే సముద్ర తీర ప్రాంతంలో జరిగే డ్రగ్ మాఫియా స్టోరీగా తెలుస్తోంది.
ఎన్టీఆర్-నీల్ చిత్రంలో సముద్రంలో చాలా సన్నివేశాలుంటాయని సమాచారం. దాని కోసం ప్రశాంత్ నీల్ భారీ సముద్రం సెట్ వేయిస్తున్నారట. సో ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సముద్రపు కథలతోనే సినిమాలు చేసుకుంటూ హిట్లు కొట్టేలా ఉన్నారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.