Advertisement
Google Ads BL

మాస్ రాజా తో ఆ ఇద్దరు భామలు


ప్రస్తుతం రవితేజ తన తాజా చిత్రం మాస్ జాతర షూటింగ్‌లో మునిగిపోయాడు. అయితే దీని తర్వాత ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే విషయంలో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం క్లాస్ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ ఓ సినిమాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథను వినిపించగా ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు అనార్కలి అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Advertisement
CJ Advs

ఈ కథలో ఇద్దరు కథానాయికలకు ప్రత్యేక స్థానం ఉందని తెలుస్తోంది. అందుకే ఈ పాత్రలను ఎవరు పోషిస్తారనే అంశంపై భారీ ఆసక్తి నెలకొంది. హీరోయిన్ రేసులో మమితా బైజు, కయాడు లోహార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

మమితా బైజు ఇప్పటికే ప్రేమలు సినిమా ద్వారా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇక కయాడు లోహార్ విషయానికి వస్తే ఆమె తాజాగా విడుదలైన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రంతో మంచి హిట్ అందుకుంది. ఇద్దరూ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే కిషోర్ తిరుమల స్టైల్‌లో రాసుకున్న ఈ కథలో వీరు మరింత మెప్పిస్తారని అంచనా వేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండటం సహజమే. అందం అభినయాన్ని సమపాళ్లలో చూపించాల్సిన ఈ పాత్రల్లో మమితా, కయాడు ఆకట్టుకుంటారనే నమ్మకం ఉంది. ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

Mass Raja having hot beauties in Anarkali:

Ravi Teja Anarkali Movie Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs