సీరియస్ స్టార్స్ నిఖిల్-కావ్య ల నడుమ ప్రేమాయణం అందరికి తెలుసు, నిఖిల్-కావ్య కలిసి జంటగా చాలా చోట్ల కనిపించారు. వీరి మధ్యన ప్రేమాయణం నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళకముందే బ్రేకప్ అయ్యింది అనే న్యూస్ చక్కర్లు కొట్టింది. బిగ్ బాస్ సీజన్ 8 లో నిఖిల్ కూడా కావ్య తో బ్రేకప్ అయినట్లుగా చెప్పాడు.
బయట కావ్య కూడా చాలా సందర్భాల్లో నిఖిల్ విషయం ఓపెన్ అవ్వకుండా సింగిల్ గా ఉండడంపై పోస్ట్ లు పెట్టింది. ఇక నిఖిల్ విన్నర్ అయ్యి బయటికొచ్చాక కావ్యతో కలిసిపోతాడు అని అందరూ ఎక్స్పెక్ట్ చేసారు. కాని అలాంటిదేమి కనిపించలేదు. కావ్య-నిఖిల్ స్టార్ మా వేదికపై కనిపించినా ఎడ మొహం పెడ మొహంగానే కనిపించారు.
తాజాగా నిఖిల్-కావ్యాల నడుమ ప్యాచప్ అయ్యిందా అనే అనుమానాలు కలిగేలా నిఖిల్-కావ్యలు కలిసి స్టార్ మా సీరియస్ లో కనిపించబోతున్నారు. కావ్య ప్రధాన పాత్రలో చిన్ని సీరియల్ లో నిఖిల్ మధ్యలో ఎంటర్ అవుతున్నాడు. మరి ఇద్దరి మధ్యన ప్యాచప్ అవ్వబట్టే కలిసి ఒకే సీరియల్ లో పని చేస్తున్నారని అనుకుంటున్నారు.