Advertisement
Google Ads BL

మిల్కీబ్యూటీ బ్రేకప్‌కి కారణం ఇదేనా


నటుడు విజయ్ వర్మతో కొన్నాళ్లుగా మిల్కీబ్యూటీ తమన్నా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య బాలీవుడ్‌లో ఏ వేడుకలో చూసినా వీరిద్దరూ జంటగానే కనిపించారు. మరి ఏమైందో ఏమో.. సడెన్‌గా వీరిద్దరి మధ్య బ్రేకప్ అయిందంటూ వార్తలు వచ్చేశాయి. అంతేనా, తమన్నా కూడా వర్మకి సంబంధించి ఫొటోలన్నింటినీ సోషల్ మీడియా అకౌంట్స్‌లో తొలగించి, ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది.

Advertisement
CJ Advs

దీంతో, అసలు వీరిద్దరి బ్రేకప్‌కి కారణం ఏమై ఉంటుందా? అని సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. వారి బ్రేకప్‌కి కారణం ఏమిటో తమన్నానే ఇన్ డైరెక్ట్‌గా తను పాల్గొన్న ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రేమను ఎప్పుడైతే లావాదేవీగా చూడటం మొదలుపెడతారో, అప్పుడే అసలు సమస్యలు వస్తాయంటూ, ఈ మిల్కీబ్యూటీని వర్మ ఏ విధంగా చూస్తున్నాడో, ఎందుకు బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందో ఇన్ డైరెక్ట్‌గా చెప్పేసింది.

ప్రేమిస్తే వారి భావాలకు స్వేచ్ఛనివ్వాలి. రిలేషన్ షిప్‌లో ఉన్నప్పటి కంటే లేనప్పుడే నేను హ్యాపీగా ఉన్నాను. మనిషికి భాగస్వామి అవసరమే కానీ, ఆ భాగస్వామి ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అని తమన్నా తన లైఫ్ లెసన్‌ని అందరితో షేర్ చేసుకుంది. 

Tamannaah Opens Up About Breakup with Vijay Varma, Reveals the Reason:

Tamannaah Talks About Her Breakup, Says Giving Space in a Relationship is Crucial
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs