రెండు రోజుల క్రితం గాయని కల్పన అపస్మారక స్థితిలో ఉండగా అపార్ట్మెంట్ వాసులు-పోలీసులు ఆమెను నిజాంపేట ప్రవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసిన విషయం తెలిసిందే. కల్పన మోతాదుకు మించి నిద్రమాత్రలు తీసుకోవడంతో ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా అనుకున్నారు. కానీ ఆమె ఆత్మహత్య చేసువాలనుకోలేదట.
కల్పన డిప్రెషన్ తో బాధపడుతూ అధికంగా నిద్ర మాత్రలు మింగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లుగా ఆమె కుమార్తె క్లారిటీ ఇచ్చింది. ఈలోపు కల్పన భర్త ను పోలీసులు విచారించేందుకు కస్టడీలోకి తీసుకున్నారు. తాజాగా కల్పన కోలుకుని ఓ వీడియో విడుదల చేసారు.
తన భర్తకు తమకు ఎలాంటి విభేదాలు లేవని, భర్తతో సమస్యలేదు, ఆయన తనని చదివిస్తున్నారు, ఆయన సపోర్ట్ తో LLB చదువున్నట్టుగా, కుటుంబ సమస్యలేమీ లేవు, నిద్ర పెట్టక నిద్రమాత్రలు ఓవర్ డోస్ వేసుకోవడం వల్లే ఈ పరిస్థితి అంటూ కల్పన ఓ వీడియో విడుదల చేసారు.