Advertisement
Google Ads BL

పవన్‌పై కామెంట్స్ చిక్కుల్లో దువ్వాడ


గత ప్రభుత్వంలో అధికార మదంతో ఎవరైతే అకారణంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారో, వారంతా ఒక్కొక్కరిగా జైలు బాట పడుతున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్, చంద్రబాబు‌లపై కామెంట్స్ చేసిన పోసాని రోజుకో జైలు మారుతున్నారు. ఏపీలో పోసానిపై ఏకంగా 17 కేసులు నమోదు అయ్యాయి.

Advertisement
CJ Advs

ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి దువ్వాడ శ్రీనివాస్ చేరారు. ఆయన వైసీపీ ఎమ్యెల్సీ‌గా పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ విషయంలో అడపా మాణిక్యాలరావు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానితో పోలీసులు దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ పై ఇష్టానుసారంగా రెచ్చిపోయి మాట్లాడిన దువ్వాడ పై కేసు నమోదు కావడంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు అంటున్నారు. 

ముందుగా దువ్వాడను విచారణకు పిలిచి, అవసరమైతే అరెస్ట్ చేసే ఆలోచనలో గుంటూరు పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎంతమందిపై ఎన్ని కేసులు నమోదయ్యి జైలుకెళుతున్నా టీడీపీ అభిమానులు శాంతించడం లేదు. కారణం కొడాలి నాని, పేర్ని నాని, రోజా లాంటి వాళ్ళను కూటమి ప్రభుత్వం ఇంకా అరెస్ట్ చేయకపోవడంతో వారు అసంతృప్తిగా ఉన్నారు.

YSRCP MLA Duvvada Srinivas Arrested for Comments on Pawan Kalyan:

AP Police Book Case Against Duvvada Srinivas for Derogatory Remarks on Pawan Kalyan <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs