Advertisement
Google Ads BL

నయన్‌లో ఎంత మార్పు


గతంలో ఏమిటి నిన్నమొన్నటివరకు నయనతార తాను నటించిన సినిమాల ప్రమోషన్స్ విషయంలో అసలు కనిపించేది కాదు, సూపర్ స్టార్ రజినీకాంత్ అయినా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయినా నయనతార ఎవ్వర్నీ పట్టించుకోదు. సినిమా సెట్స్‌కి వెళ్లి నటించడం వరకే నయనతార పని, ఆ తర్వాత మేకర్స్ ఎవ్వరేమనుకున్నా ఆమెకి సంబంధం ఉండదు. 

Advertisement
CJ Advs

కొద్దిరోజుల క్రితం భర్త విగ్నేష్ శివన్ తెరకెక్కించిన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పుడు నయనతార పై చాలా విమర్శలొచ్చాయి. ఆ తర్వాత నయనతార మళ్ళీ ఏ ప్రమోషన్‌లో కనిపించలేదు. తాజాగా ఆమె ఓ కోలీవుడ్ మూవీ ఓపెనింగ్‌లో కనిపించి అందరికీ షాకిచ్చింది. 

సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కనున్న మూకుతి అమ్మన్ 2 ఓపెనింగ్‌కి నయనతార హాజరైంది. ఇదే ఈవెంట్‌లో మీనా, ఖుష్బూ, రెజీనా అందరితో పాటుగా నయనతార కూడా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది చూసిన వారంతా నయన్‌లో ఇంత మార్పా అని అందరూ షాకవుతున్నారు. 

ఎప్పుడు సినిమాల్లో నటించే వరకే.. ప్రమోషన్స్‌కు రాను అని అగ్రిమెంట్ రాయించుకునే నయనతార, ఇలా ఓ ఓపెనింగ్‌లో కనిపించడం వెనుక కారణాలేమిటో అందరూ తెగ సీరియస్‌గా ఆలోచించేస్తున్నారు. అయితే, ఈ సినిమా నిర్మాణంలో తను కూడా భాగస్వామి కాబట్టే హాజరై ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

Nayanthara Stuns Fans with Sudden Appearance at Movie Launch:

Nayanthara Surprising New Avatar: Whats Behind Her Sudden Change  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs