శ్రీదేవి - బోనీ కపూర్ ల చిన్న కుమార్తె ఖుషి కపూర్ హీరోయిన్ అయ్యింది. అక్క జాన్వీ కపూర్ లాగే సో సో గా కెరీర్ స్టార్ట్ చేసింది. రీసెంట్ గా ఖుషి కపూర్ నటించిన లవ్ యాప చిత్రం సో సో రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది ఆ చిత్ర ప్రమోషన్స్ లో ఖుషి కపూర్ చక్కటి గ్లామర్ షో చేసింది.
అప్పుడప్పుడు సోషల్ మీడియా లోనూ గ్లామర్ లుక్స్ షేర్ చేసే ఖుషి కపూర్ అక్క జాన్వీ కపూర్ తోనూ, అలాగే తన ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఖుషి కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన లుక్ చూస్తే పిల్ల భలే ఉంది అంటారేమో. సారీ లాంటి మోడ్రెన్ డ్రెస్ లో ఖుషి కపూర్ అందాలు ఆరబోసిన తీరుకి ఫిదా అవ్వాల్సిందే.
లూజ్ హెయిర్ తో క్రీమ్ కలర్ అవుట్ ఫిట్ లో ఖుషి కపూర్ ఏంజిల్ మాదిరిగా మెరిసిపోయింది. మీరు కూడా ఖుష్ కపూర్ లేటెస్ట్ లుక్ పై ఓ కనెయ్యండి.